• తెలుగు భాషా దినోత్సవం

  • By: SBS
  • Podcast

తెలుగు భాషా దినోత్సవం

By: SBS
  • Summary

  • తెలుగు రచయితల ఆలోచనాధారలో మార్పులు తెచ్చి సాహిత్య ప్రవాహాన్ని గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాషకు మరల్చిన వ్యావహారిక భాషా పితామహుడు, అభినవ వాగమశాసనుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. 1919లో ‘తెలుగు’ అనే మాసపత్రికను స్థాపించి మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతికరంగాలలో పురోగతి సాధించాలంటే వాడుక భాషలో పాఠ్యగ్రంధాలుండాలని వ్యావహారిక భాషావాదాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే, భాషాభివృద్ధిని కొంతపుంతలు తొక్కించిన వ్యావహారిక భాషా కర్షకుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. వారి జన్మదినమైన ఆగష్టు 29వ తేదిని తెలుగు జాతి అంతా తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటోంది. ఈ తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని, తెలుగ భాష ఔనిత్యాన్ని చాటే కార్యక్రమాలను ఈ నెలలో ప్రతి గురువారం SBS తెలుగు భాషాభిమానులకు, తెలుగు శ్రోతలకు అందించనుంది.
    Copyright 2025, Special Broadcasting Services
    Show More Show Less
activate_Holiday_promo_in_buybox_DT_T2
Episodes
  • తెలుగు భాషా దినోత్సవం EP5: తెలుగుబడి కదంబ కార్యక్రమం
    Aug 29 2024
    గత నాలుగు వారాలుగా తెలుగు భాషా ఔనిత్యాన్ని, ప్రాశస్త్యాన్ని, భాషలోని సొగసుని, సొబగులని, సాహితీ పరిమళాలని తెలుసుకుంటూ వస్తున్నాం.
    Show More Show Less
    22 mins
  • తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు..
    Aug 22 2024
    ఏ భాషకైనా తలమాణికాలు సామెతలు, జాతీయాలు. భాషకు సొబగులు అద్ది, భావ ప్రకటనకు దోహదపడేవే సామెతలు. సరళ సుందరమైన భాష, భావావేశం, లయ సామెతలకు పెట్టని అలంకారాలు. అక్షరజ్ఞానం ఉన్నవాడైన, లేనివాడైనా మాటల్లో చమత్కారాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఒలకబోస్తాడు. ఆ చమత్కారంలో ఆనందం, ఉపదేశం రెండూ ఇమిడి ఉంటాయి. ‘వాక్యం రసాత్మకమ్ కావ్య’ మయితే రసాత్మకమైన వాక్యమే సామెత.
    Show More Show Less
    13 mins
  • తెలుగు భాషా దినోత్సవం EP3: తెలుగు సాహిత్యంలో జాతీయత.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు...
    Aug 15 2024
    సమాజంలోని మార్పులకు అనుగుణంగా కవులు స్పందించటం పరిపాటి. నాడు ఆంగ్లేయుల దాస్య శృంఖలాలు నుంచి విముక్తి పొందటానికి చేసిన పోరాటంలో అనేకమంది తెలుగువారు ప్రాణాలు అర్పించారు. తెలుగు కవులు కూడా తమ వంతుగా స్వాతంత్రోద్యమ భావనను రగిలించే రచనలు చేసి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించారు.
    Show More Show Less
    17 mins

What listeners say about తెలుగు భాషా దినోత్సవం

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.